నిశ్శబ్దం — పరిచయం
నిశ్శబ్దం నుండి జన్మించే ఆలోచన, ఆలోచన నుండి పుట్టే అక్షరం - ఇదే నా రచనా ప్రస్థానం.
"నిశ్శబ్దం నుండి జన్మించే ఆలోచన, ఆలోచన నుండి పుట్టే అక్షరం - ఇదే నా రచనా ప్రస్థానం"
నిశ్శబ్దం అంటే ఏమిటి? అది మన మనసులోని ఆలోచనల మధ్య ఉండే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం నుండే మన భావాలు, ఆలోచనలు, అనుభూతులు జన్మిస్తాయి. ఒక అందమైన అర్థరాత్రి నా నిశ్శబ్దపు జాతరలో తప్పిపోయి నన్ను నేను వెతుక్కుంటూ నాకు నేనే దొరికి ఆ సంబరంలో గట్టిగా అరిస్తే ఆ నిశ్శబ్దం లో నా శబ్దం వినపడదే ఆ అరుపులను అక్షరాలుగా పరిస్తే ఈ నా నిశ్శబ్దపు బ్లాగు ...