/avi
/avi

ఇంజినీర్ మనస్సు

Systems thinking ని everyday life లో apply చేయడం — ఇది వరమా, శాపమా?

నేను ఒక software engineer ని. ఇది just job కాదు — ఇది ఒక way of seeing the world.

Aadhya school bus miss అయినప్పుడు, నా మొదటి thought: "Root cause ఏమిటి? Morning routine లో bottleneck ఎక్కడుంది?" ఆమె ఏడుస్తుంటే నేను process optimize చేయడానికి ఆలోచిస్తున్నాను. Gouthami నన్ను look చేసింది — that look అర్థమైంది. "ఇప్పుడు engineer mode off చేయి."

కానీ నేను off చేయలేను. ఇది toggle కాదు.

Systems Thinking — వరమా శాపమా?

వరం: ఒక complex problem వచ్చినప్పుడు, నేను systematically decompose చేయగలను. Family budget, kids' education plan, home loan scenarios — వీటిని spreadsheets లో, mental models లో think చేయగలను. ఇది genuinely useful.

శాపం: Relationships ని systems లా treat చేయలేవు. Gouthami అనేది "నాకు tired గా ఉంది" అంటే, correct response "ఏం optimize చేయాలి?" కాదు. Correct response — పక్కన కూర్చోవడం, listen చేయడం.

ఇది నేను actively నేర్చుకుంటున్నాను. Every day.

Debugging vs Accepting

Engineer mind కి bugs tolerate చేయడం కష్టం. Everything fixable అనిపిస్తుంది. కానీ కొన్ని things fix చేయలేవు — grief, homesickness, aging parents. వాటిని debug చేయడానికి try చేయడం exhausting.

ఒక mentor చెప్పాడు: "Not every problem needs a solution. Some problems need presence."

ఇది engineer గా నేను accept చేయడానికి చాలా time పట్టింది.

అందం ఏమిటంటే

ఇంజినీర్ మనస్సు కి ఒక అందం ఉంది — curiosity. Why ఎందుకు ఇలా ఉంది? How improve అవుతుంది? ఈ curiosity photography లో కూడా వస్తుంది — light ఎందుకు ఇలా fall అవుతుంది? ఈ shot లో composition బాగా పడిందా? ఎందుకు?

నిశ్శబ్దం రాయడంలో కూడా ఇదే — ఈ thought ఏం చెబుతుంది? Better గా express చేయవచ్చా?

Engineering mind is not a bug. It's a feature — just needs calibration.


మీరు engineer అయినా కాకపోయినా — mనస్సు ఎలా think చేస్తుంది? share చేయండి.